నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన సమయంలో మానవతా హృదయంతో శేరిలింగంపల్లి ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కొడాలి చారిటబుల్ ట్రస్టు చైర్మెన్ డా.కొడాలి రవికుమార్ ను సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ సన్మానించారు. ఆదివారం కమీషనరేట్‌లోని సజ్జనార్ కార్యాలయంలో కొడాలి రవిని సన్మానించి అభినందనలు తెలిపారు. గత సంవత్సరం లాక్‌డౌన్ విధించిన సమయంలో దాదాపు 28 రోజుల పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బిక్షాటకులకు ట్రస్టు తరపున ప్రతిరోజూ అల్పాహారం అందజేశారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజాజీవనం అతలాకుతలమైన సందర్భంలో సహృదయంతో అభాగ్యులకు సేవలందించిన రవికుమార్ స్పూర్తిదాయకంగా నిలిచారని సజ్జనార్ కొనియాడారు.