చంద్రబాబు అరెస్ట్ అక్రమం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీ (భాజపా) కనుసన్నల్లోనే చంద్రబాబుని అరెస్ట్ చేశారని, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు నాయుడు వంటి ముఖ్యనేతలను కేసుల పేరుతో అరెస్టు చేసి, భయపెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని, ఇటువంటి అక్రమ కేసులను సమాజం హర్షించదని చెప్పారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here