బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారమే ఏకైక లక్ష్యం : రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్

  • కాాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాలమని బీసీ ఐక్యవేదిక ముఖ్య నాయకుల వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంటు లోకసభ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జాతీయ బీసీ ఐక్యవేదిక చైర్మన్, రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి, బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని బీసీ ఐక్యవేదిక ముఖ్య నాయకులు కలిసి సుధీర్ణ చర్చలు జరిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారమే ఏకైక ముఖ్యమని, ఆ దిశగా పని చేస్తామని కాసానికి తెలిపారు. శేరిలింగంపల్లిలోని 10 డివిజన్లలో ప్రచార కార్యక్రమం నిర్వహించి గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.

కాసాని జ్ఞానేశ్వర్ తో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, ఎన్నికల కమిటీ చైర్మన్ అంబటి చెన్నయ్య, సిటీ అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, నేషనల్ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, జేఏసీ కార్యదర్శి రామన్న

ఈ సమావేశంలో ఎన్నికల కమిటీ చైర్మన్ అంబటి చెన్నయ్య, సిటీ అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, నేషనల్ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, జేఏసీ కార్యదర్శి రామన్న వీరి సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీసీ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, సిరి లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్, మెదక్ జిల్లా అధ్యక్షులు నరసింహులు, అశోక్ యాదవ్ ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here