నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని జమీతుల్ ఉల్ అన్సార్ (శేరిలింగంపల్లి) కమిటీ అధ్యక్షుడు అలీ ఆధ్వర్యంలో ఈద్-ఉల్-ఫితుర్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ మనమంతా మనుషులం, మానవత్వమే మన మతం, ప్రతి మతంలో కొన్ని సుగుణాలు ఉంటాయని, అలాగే కొన్ని నచ్చని అంశాలు ఉంటాయని, మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు లేని మతం ఏదైనా సంస్కరించబడాల్సిందేనన్నారు. ప్రపంచంలో ఉన్నవి రెండే రెండు మతాలు అవి మంచి, చెడు మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ గౌడ్, అక్బర్, యూసఫ్, అంజాద్ పాల్గొన్నారు.