- పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు శ్రీరాములు గౌడ్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కొండాపూర్ డివిజన్ మహిళ నాయకురాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన రాణి, సావిత్రి, లక్ష్మి, రేవతిలను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగం గౌడ్, సంజయ్ కుమార్, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.