నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ లోని కార్యసిద్ధి వినాయక దేవాలయం ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, నరేష్, కుమార్, సత్యం, భుజంగం మరియు శోభన్ శ్రీ కార్య సిద్ధి వినాయక కమిటీ సభ్యులు సంతోష్ రెడ్డి, శ్రీరామ మూర్తి, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, మహేందర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
