- సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి కింద రూ. 5 లక్షల 44 వేలు మంజూరు
- బాధిత కుటుంబాలకు సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి పత్రాలు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా .. సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి నుంచి రూ. 5 లక్షల 44 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి పత్రాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు. ఈ సందర్బంగా సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి పత్రాలు అందుకున్న వారి వివరాలు వెల్లడించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పద్మజ కాలనీ కి చెందిన హైమవతికి రూ. 2 లక్షల 50 వేలు, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ కి చెందిన జంగమ్మకి రూ. 1 లక్ష, కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాంనగర్ A బ్లాక్ కాలనీ కి చెందిన సయ్యద్ లయక్ అలీకి రూ. 1 లక్ష, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన తులసికి రూ. 94 వేలు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, చంద్రారెడ్డి, కాశినాథ్ యాదవ్, ఆంజనేయులు, చంద్రమోహన్ సాగర్ పాల్గొన్నారు.
