నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ లోని CBR ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి , అభినదించారు, శుభాకాంక్షలు తెలిపారు. CBR ఎస్టేట్స్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి పాటుపడాలని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో CBR ఎస్టేట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రావు ప్రసాద్, జనరల్ సెక్రటరీ వెంకట రాము, ట్రెజరర్ విశ్వాస్ కుమార్ పాల్గొన్నారు.