నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కమ్యూనిటీ హాల్ లో కంటి వెలుగు శిబిరాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. కంటి వెలుగు సెంటర్ లో జరుగుతున్న వైద్యం వివరాలను వైద్యం కోసం వచ్చే వారిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల కు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు BSN కిరణ్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు చంద్రికప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ గోపారాజు, మహ్మద్ కాజా, స్వామి నాయక్, అశోక్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.