లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

  • కన్విక్షన్ల శాతాన్ని పెంచాలి
  • బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి
  • 2023 సంవత్సరానికి లక్ష్యాలపై శంషాబాద్ జోన్ పోలీస్ అధికారులకు సీపీ దిశా నిర్దేశం
  • నేరాల నియంత్ర‌ణ‌, పోలీసు దర్యాప్తు తీరుతెన్నుల‌పై సైబరాబాద్‌ సీపీ సమీక్షా సమావేశం
  • పనితీరు మెరుగు పరుచు కోవాలని సూచన
క్రైమ్ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సిపి స్టీఫెన్ రవీంద్ర

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధి లోని శంషాబాద్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ఆఫీసులో క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023 సంవత్సరానికి గాను ఛేదించే లక్ష్యాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి లోని శంషాబాద్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల లో నేరాల సంఖ్యను తగ్గించే విధంగా పోలీస్ సిబ్బంది పని చేయాలన్నారు. ముఖ్యంగా బేసిక్ పోలీసింగ్, సెక్టార్ వైస్ పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు. అత్యుత్తమ పనితీరును కనబర్చాలన్నారు. సెల్ఫ్ డ్రివెన్ తో మోటివేషన్ తో పనిచేయాలన్నారు. త్వరితగతిన కన్విక్షన్లను ట్రయల్ కు తీసుకురావాలన్నారు. సెక్టార్ ఎస్సైలు పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సెక్టార్ ఎస్ఐలది కీలకపాత్ర అన్నారు. నేరాలను తగ్గించేందుకు సెక్టార్ ఎస్సైలు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలన్నారు. ముఖ్యంగా పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై దృష్టి సారించాలన్నారు. కోర్ట్ ట్రయల్ కు మొదటి రోజు కచ్చితంగా హాజరు కావాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఇన్ స్పెక్టర్లు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి అన్నారు. స్పష్టమైన లక్ష్యాలు, స్పష్టమైన గమ్యాలను నిర్దేశించుకోవాలన్నారు.

ప్రతివారం లాండ్ ఆర్డర్ పై సమీక్షలు చేయాలన్నారు. సాక్షాలను సేకరించడం, సంబంధిత జడ్జీలు మెజిస్ట్రేట్లతో సంప్రదించి త్వరితగతిన బాధితులకు న్యాయ సేవలు అందించాలన్నారు.

సంబంధిత డీసీపీలు.. ఏసీపీలు, ఇన్ స్పెక్టర్ ఎస్ఐల పనితీరుపై పర్యవేక్షించాలన్నారు. వారి పై మానిటరింగ్ మెకానిజం ఉండాలి అన్నారు. సెక్టార్ ఎస్ఐల పనితీరుపై తానే స్వయంగా దృష్టి సారిస్తానని సీపీ తెలిపారు.

రాష్ట్రంలోనే సైబరాబాద్ కమీషనరేట్ పరిధి లోని శంషాబాద్ జోన్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, రూరల్ సబ్ అర్బన్ ప్రాంతాలు ఉన్నందున శాంతి భద్రతలు కీలకమన్నారు. విజిబుల్ పోలీసింగ్, ప్రొయాక్టివ్ పోలీసింగ్ పద్ధతులను అవలంబించాలన్నారు.

గస్తీ వాహనాలు ఎల్లవేళలా ప్రజా రద్దీగా ఉండే ప్రాంతాలలో, కూడళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది కేసుల ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి వారి వెన్నులో వణుకు పుట్టించేలా పోలీసింగ్ ఉండాలన్నారు.

పోలీస్ స్టేషన్లో నమోదైన అన్ని కేసులను చట్ట ప్రకారం నాణ్యమైన పద్ధతులలో దర్యాప్తు చేసి త్వరతగతిన చార్జ్ షీట్లు వేసి కోర్టులలో దర్యాప్తు అధికారులు సమర్పించాలని ఆదేశించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తదనుగుణంగా పాయింట్ పుస్తకాల పునర్వ్యవస్థీకరణ చేయాలన్నారు. MO క్రిమినల్స్, హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై స్థానిక SHOలు నిఘా ఉంచి వారు ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించారు. పీడీ యాక్ట్ ల నమోదు, సీసీటీవీల ఏర్పాటు పై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసులను త్వరితగతిన లోక్ అదాలత్, కన్విక్షన్లు తీసుకురావాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. అలాగే సిబ్బందికి అవసరమైన ఏదైనా సామగ్రి కావాలన్నా సమాచారం ఇవ్వాలన్నారు.

 

సమీక్షా సమావేశానికి హాజరైన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది

ఫిర్యాదుల పైన తక్షణమే స్పందించాలి అన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలి అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీతో పాటు .. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ శ్రీమతి ఇందిరా, సీసీఎస్ ఏడీసీపీ నర్సింహా రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here