సంక్షేమ పథకాల అమలులో తెలంగాణే టాప్

  • సంక్షేమ ప్రభుత్వంగా బిఆర్ఎస్ : ప్రభుత్వ విప్ గాంధీ
  • 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్ పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదీముబారక్ పథకం నుంచి 60 మంది లబ్ధిదారులకు రూ. 60 లక్షల 6 వేల 960 లు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులకు చెక్కుల రూపేణా అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నాడని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, కాశినాథ్ యాదవ్, ఎం డి ఇబ్రహీం, ఆంజనేయులు, రఘునాథ్, మోజేష్, సలీమ్, చంద్రమోహన్ సాగర్, అష్రాఫ్, షరీఫ్, బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి అనంతరం లబ్ధిదారులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here