పద్మ విభూషణ్ కాళోజి నారాయణకు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తన కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాళోజి నారాయణ చాలా గొప్ప ప్రజా కవి, తెలంగాణ వాది అని పేర్కొన్నారు. కాళోజి 20 ఏళ్లకే దేశం కోసం జైలు వెళ్ళడానికి కూడా వెనుకాడలేదని, ఆయన రచనలు మానవాళికి స్ఫూర్తి అని అన్నారు.

అంతేకాక బీ ఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్ గుప్తా జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, చాంద్ పాషా, రజినీకాంత్, ప్రభాకర్, శ్రీహరి, రాము, పద్మ, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దండు గుల రామకృష్ణ, మీడియా విభాగం అధ్యక్షులు ఎర్ర యాకయ్య రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్ నాయక్, రాష్ట్ర నాయకులు ఆనంద్ కుమార్ గుప్తా , రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ , లింగంపల్లి మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లెల జయశ్రీ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here