- సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
- 600 మందికి పరీక్షలు.. ఉచితంగా అద్దాలు పంపిణీ చేసిన ట్రస్ట్ యాజమాన్యం
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్, ట్రస్ట్ సెక్రటరీ రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్నినిర్వహించారు. నిరుపేదలకు కంటి అద్దాలను పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని తూతూ మంత్రంగా కొన్ని రోజులు మాత్రమే నాసిరకం కంటి అద్దాలనిచ్చి చేతులు దులుపుకున్నారని, నిరంతరం, బడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉంటూ కంటి సమస్యలు ఉన్నవారికి కంటి అద్దాలను, విద్య పరంగా సమస్యలున్న వారికి ఉచిత నోట్ బుక్స్, ఆర్థిక సహాయం అందిస్తూ అందరి మన్నలను పొందుతున్నామన్నారు ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్. ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా పేదవారికి సామాజిక సేవ రాజకీయ కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలపై ఎనలేని పోరాటం చేసి సంఘంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడమే ఏకైక లక్ష్యం రవి కుమార్ యాదవ్ తెలిపారు.
కార్యక్రమంలో ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, రమేష్, విజయలక్ష్మి, అరుణ, నర్సింగ్ యాదవ్, కోటి, రాజు, సుశీల, అంకమ్మ, భద్ర, నీలకంఠారెడ్డి, అప్పారావు పాల్గొన్నారు.