నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి లో జనసైనికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దశాబ్దాల కాలంగా వరద నీటి కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుండి వెళ్లే వాహనదారులకు, పాదాచారులకు కలిగే సమస్యల నుండి శాశ్వత పరిష్కారం చూపాలంటు జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంఛార్జి మాధవ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సబ్వే పరిస్థితి కూడా ఇలాగే ఉందని అకాల వర్షాలకే వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే రాబోయే వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని మాధవ రెడ్డి అన్నారు. చందనగర్ రైల్వే స్టేషన్ సబ్వే నీ సందర్శించిన మాధవ రెడ్డికి స్థానికులు తమ బాధలను చెప్పుకున్నారు. అనంతరం ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, శ్రావణ్ , నరేష్ , ఉపేంద్ర , రాజేష్ గౌడ్ , రాజు , ఉదయ్ , ప్రవీణ్ సాహూ , బాలాజీ నిఖిల్ , రోహిత్ , సాంబ, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.