నమస్తే శేరిలింగంపల్లి: నేడు ప్రభుత్వ పాఠశాలు సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 75 లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు మండల విద్యాధికారి వెంకటయ్య, కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తరగతి గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో TSEWIDC AE శ్యామ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉట్ల కృష్ణ, రమేష్ పటేల్, తిరుపతి రెడ్డి, శశిధర్, తిరుపతి యాదవ్, గణపతి, రవి శంకర్ నాయక్, శ్రవణ్ యాదవ్ ,రాజు యాదవ్, బసవరాజు, సుబ్బయ్య యాదవ్, రాజు నాయక్, నమిద్, రవీందర్ రెడ్డి, అబ్దుల్ కరీం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.