ఇదొక సువర్ణావకాశం.. సద్వినియోగం చేసుకోండి: ప్రభుత్వ విప్ గాంధీ

  • GHMC సహకారంతో లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం GHMC సహకారంతో లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ కల్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ శంకరయ్య, ప్రాజెక్టు ఆఫీసర్ ఉషారాణితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

జాబ్ మేళా లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలిపించాలనే సదుద్దేశంతో GHMC సహకారంతో లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకొని ఉపాధి పొందాలని, చక్కటి ప్రతిభను కనబర్చి ఉద్యోగం పొంది తమ కాళ్ళ మీద తాము నిలబడేలా గొప్ప సువర్ణావకాశం ఇది అన్నారు. అదేవిదంగా ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఆశావహులతో కాసేపు ముచ్చటించి, కంపెనీల వివరాలు , జాబ్ మేళా వివరాలు అడిగి తెలుసుకున్నారు, కంపెనీల ప్రతిధుల తో మాట్లాడి కంపనీల వివరాలు, రిక్రూట్ మెంట్ విధానం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న తన వంతు కృషి తప్పకుండా ఉంటుంది అని, నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు.

మేళా కు వచ్చిన యువతతో మాట్లాడుతున్న గాంధీ

ఈ కార్యక్రమంలో లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ప్రతినిధులు అమృత, శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, శ్రీధర్ , మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్తర్, ఓ. వెంకటేష్, చింతకింది రవీందర్, నటరాజు పాల్గొన్నారు.

జాబ్ మేళా కు హాజరైన నిరుద్యోగ యువతీ, యువకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here