నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ వాంబే కాలనీలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ పాదయాత్ర చేపట్టారు. ప్రతి గల్లీలోకి వెళ్లి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు డ్రైనేజీ మురుగుతో కలిసి సరఫరా కావడం వల్ల జ్వరాలు, వాంతులతో స్థానికులు చాల సమస్యలు ఎదురుకుంటున్నారని అన్నారు.
ఈ సమస్యను డిసి , జెడ్ సి కి కలిసి మీ సమస్య పరిష్కారం చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానికులు బలరాం, మైనారిటీ అజీముద్దీన్, జహంగీర్, అయాజ్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, రాజేందర్, సేవాదళ్ చైర్మన్ గోల్కొండ శేఖర్, కొండా, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ తలారి పాల్గొన్నారు.