- బోనాలు సమర్పించిన భక్తులు
- కిటకిటలాడిన ఆలయాలు
- ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ ఓల్డ్ లింగంపల్లి విలేజ్ లో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం లింగంపల్లి ఎస్సీ బస్తిలో శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ఘటం ఊరేగింపుతో వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి బోనాల ఉత్సవాలలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని అమ్మవారిని వేసుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో SLVDCP గడ్డం రవి యాదవ్, పురం విష్ణు వర్ధన్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, గోపాల్ యాదవ్, బుయ్య మల్లేష్ గౌడ్, అజీమ్, కృష్ణ యాదవ్, కిషోర్ యాదవ్, సాయి కిరణ్ యాదవ్, మల్లేష్ యాదవ్, సుశాంత్ యాదవ్, లింగంపల్లి ఎస్సీ బస్తీ బి. రాజు, బి. మహేందర్, బి. సురేష్, బి. ప్రశాంత్, రాజేష్, రోహిత్, ఇంతియాజ్, ఉదయ్ పాల్గొన్నారు.