ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తా వద్ద ఘనంగా జరిగాయి. జయశంకర్ విగ్రహానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను కార్పొరేటర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తమ జీవితాంతం కష్టపడ్డారని, తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, శ్రీనివాస్, గోపాల్ యాదవ్, రవి యాదవ్, గోవింద్ చారీ, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, సురేష్, సారయ్య, గణపురం రవి, సుధాకర్ రెడ్డి, అబ్దుల్ రహీం, వెంకట్ రెడ్డి, సత్య నారాయణ, ప్రభాకర్, ఉదయ్ యాదవ్, శ్రీనివాస్, అజీమ్, సుభాష్, బైండ్ల నరసింహ, బ్యాండ్ రాజు, మహేష్ చారీ, అలీం, దీప, దివ్య, నిరూప, కమల, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here