- జవహర్ నగర్ కాలనీలో గోపాల్ దాతృత్వంతో రూ. 2 లక్షల 50 వేలతో సీసీ కెమెరాల ఏర్పాటు
- ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో దాత గోపాల్ దాతృత్వంతో రూ. 2 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం సిసి కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించగా కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జవహర్ నగర్ కాలనీ వాసుల తన విజ్ఞప్తి మేరకు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం చాలా సంతోషకరమైన రోజని, ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాత గోపాల్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
కాలనీలలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషిగా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగినదని పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగేశ్వరరావు, ఎస్ఐ రఘు, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, రవీందర్ రావు , చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, లక్ష్మీనారాయణ , రాంచందర్, అక్బర్ ఖాన్, అంజద్ పాషా, సందీప్ రెడ్డి, రాము నాయుడు, అశోక్, రమేష్, మనోజ్, వరలక్ష్మి, పార్వతి కాలనీ వాసులు పాల్గొన్నారు .