మహాత్ముడికి మహా నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఆదర్శమూర్తికి ఘన నివాళి అర్పించారు. గాంధీజీ కలల సాకారం కోసం, ఆయన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్ (10K , 5K, 2k ) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, గౌరవ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి గాంధీజి చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులులర్పించారు, మొక్కలు నాటి, జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ నిర్వహించడం చాలా శుభ పరిణామమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని కానీ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ గార్డెన్ అభివృద్ధి కోసం అసోసియేషన్ చాలా కృషి చేస్తున్నాదని, వారికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ గార్డెన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం తన రాజ్యసభ నిధులనుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రకటనను స్ఫూర్తిగా తీసుకొని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కూడా వారి అభివృద్ధి నిధుల నుండి తలా 10 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా అందరు కలిసి పార్కు అభివృద్ధి కోసం రూ. 40 లక్షల నిధులు ఇచ్చిన వారందరికీ వాకర్స్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 10 K ,5K , 2K రన్ నిర్వహించడం చాలా అభినందనియమని , నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరమని గుర్తు చేయడం కోసం ఈ రన్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఎంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తుందని , వృద్ధులు , యువత , చిన్న పిల్లలు పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని , ప్రతి ఒక్కరు ఆరోగ్యము పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. మారిన జీవన శైలి లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయమం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో SKVBR బొటానికల్ గార్డెన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ రెడ్డి , బాలకృష్ణ , AV రెడ్డి అసోసియేషన్ సభ్యులు, తెరాస నాయకులు చాంద్ పాషా , జంగం గౌడ్ , రమేష్ పటేల్ , బలరాం యాదవ్ , తిరుపతి రెడ్డి, నరేష్, గణపతి , అశోక్ సాగర్, తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.

బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్ (10K , 5K, 2k ) కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి , ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ
బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్ (10K , 5K, 2k ) కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి , ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ
  • కొండాపూర్ డివిజన్ పరిధిలో..

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని కమిటీ హాలు ప్రాంగణంలో ఆక్సిజన్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆ మహనీయున్ని స్మరించుకొని నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసి, సర్టిఫికెట్లను అందజేశారు. ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు మాట్లాడుతూ, గాంధీజీ గొప్ప మానవతవాది అని, ఆయన అనుసరించిన సత్యాగ్రహం, అహింసా మార్గాలు నేటి యువతకు అనుసరణీయం అన్నారు. నాటి గాంధేయ మార్గాలు నేటి ప్రపంచ నవీకరణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.  భారతమాతకు బ్రిటిష్ సామ్రాజ్య చెర నుండి విముక్తి కలిగించిన మహోన్నత స్వాతంత్ర్య యోధుడు మహాత్మా గాంధీ అని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. అహింసే మార్గంగా, భారత దేశ ప్రజల స్వేచ్చా వాయువుల కోసం అహర్నిశలు పోరాడిన శాంతమూర్తి మహాత్మా గాంధీ అని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.  ఎమ్మెల్యే గాంధీతో బాటుగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆక్సిజన్ హాస్పిటల్ ఎండి యర్ల శ్రీనివాస్ రావు, బిజినెస్ మేనేజర్ వసీమ్ మియా, జీహెచ్ఎంసి ఏఎంహెచ్వో నగేష్, ఎస్సార్పీ రాజయ్య, కొండాపూర్ డివిజన్ తెరాస పార్టీ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, మొహ్మద్ అలీ, బాలరాజు, మీనా భి, తాడెం మహేందర్, తిరుపతి యాదవ్, డా రమేష్, గిరి గౌడ్, యాదగిరి, అబేద్ అలీ, సయ్యద్ ఉస్మాన్, శ్రీకాంత్, హిమామ్, షేక్ జలీల్ అహ్మద్, తిరుపతి, రజనికాంత్, మొహ్మద్ సోహెల్, మొహ్మద్ అబ్దుల్ ఖయ్యుమ్, అహ్మద్, జహంగీర్, సంజీవ, వసీం, అభి, సిద్దు, తుకారామ్, రవీందర్ రెడ్డి, అంజాద్ పాల్గొన్నారు.

ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని కమిటీ హాలు ప్రాంగణంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ గాంధీ, చిత్రంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, ఆక్సిజన్ హాస్పిటల్ ఎండి యర్ల శ్రీనివాస్ రావు ఉన్నారు.
  • మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కార్పొరేటర్ కార్యాలయం లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో ముఖ్య అతిథులుగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్యఫలితం. మహాత్ముడు ఎంత గొప్పవాడో.. ఆయన ప్రతిపాదించిన అహింశా, శాంతి, సేవ, తాగ్యనీరతి అనే సిద్ధాంతం ఎన్నటికైనా సార్వజనీనమైన, విశ్వజనీనమైన శాశ్వతమైన సిద్ధాంతం అని పేర్కొన్నారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్, వెంకటేష్, శివ సింగ్, తిరుపతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, ఎన్టీఆర్ నగర్ తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు. సీనియర్ నాయకురాలు వరలక్ష్మి, ఇందిరా, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్, దార్గుపల్లి అనిల్, శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్, ప్రసాద్, కృష్ణ నాయక్ , దేవరకొండ గోపాల్, ఉమేష్, రాములు, గోవర్ధన్, అరవింద్ సింగ్, రాజు, నరేందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గౌలిదొడ్డి కార్పొరేటర్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి నివాళలర్పిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
  • మునుగోడు నియోజకవర్గం లో ..

మునుగోడు నియోజకవర్గం లో గాంధీజీ చిత్రపటానికి చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మునుగోడు మండల సహా ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. మునుగోడు మండలం లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి , భారత జనతా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు.

మునుగోడు నియోజకవర్గం లో గాంధీజీ చిత్రపటానికి నివాళి అర్పించిన చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మునుగోడు మండల సహా ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్
  • చందానగర్ డివిజన్ పరిధిలో..

చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద మహాత్మాగాంధీ జయంతి నిర్వహించారు. కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జాతిపిత విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. గాంధీ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీ నారాయణ గౌడ్ , మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, వాలా హరీష్ రావు, జనార్దన్ రెడ్డి , కరుణాకర్ గౌడ్ , దాసరి గోపి, మిద్దెల మల్లారెడ్డి, ఓ. వెంకటేష్ , ప్రవీణ్, చరణ్ దుబే, మల్లేష్ పబ్బా, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి రెడ్డి, అక్బర్ ఖాన్, మిర్యాల ప్రీతమ్, ఎల్లమయ్య, పారునంది శ్రీకాంత్, హరీష్ రెడ్డి, నరేందర్ బల్లా, శ్రీనివాస్ నాయక్, యూసఫ్ పాషా,అంజద్ పాషా, కార్తిక్ గౌడ్, సికేందర్, గౌరవ్ , భవాని, సునీత రాజా, ఉదయ్ పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహానికి కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here