నమస్తే శేరిలింగంపల్లి: ఆరంభ టౌన్షిప్ కాలనీలో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా 1200 మంది కాలనీవాసులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర రాథోడ్, దుర్గామాత కమిటీ అధ్యక్షులు అంజలి రుద్ర , ప్రతిమ, అంజలి, మౌలిక, సరిత, సుజాత, కనకదుర్గ, మమత, సంతోషి, అమృత, జ్యోతి, శిరీష, అంకిత సింగ్, అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్ర కుమార్, జాయింట్ సెక్రెటరీ, మహిపాల్ యాదవ్ నరసింహులు, సురేష్ నాయక్ , జనార్ధన్, మధుసూదన్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, సాయిరాం , మహేష్, విక్రమ్ యాదవ్, శివ కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, జగదీష్, పాల్గొన్నారు.







