- హఫీజ్ పేట్ విలేజ్ లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వతంత్ర భారత కీర్తిని నలుదిశలా చాటాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ విలేజ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి జెండావందనం సమర్పించి మాట్లాడారు.
భారత దేశ, తెలంగాణ రాష్ట్ర, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయ మిత్రులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ జోహార్లు అర్పించారు. యువత మంచి స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో, గొప్ప గొప్ప లక్ష్యాలతో ముందుకువచ్చి దేశ , రాష్ట్ర, ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.