నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా దేవరకొండ రాఘవేంద్ర నియమితులయ్యారు.
తనపై నమ్మకంతో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కి, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కి, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ కి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగంకి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ మాధవ రెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీని బలోపేతం చేసేవిధంగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. నిత్యం అంకితభావంతో పనిచేస్తానని, ప్రజలకు జనసేన పార్టీ పై నమ్మకం కలిగేలా కృషి చేస్తానని తెలిపారు.