నమస్తే శేరిలింగంపల్లి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఇన్ ఛార్జి మాధవ రెడ్డి వందమంది జనసైనికులతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి మియాపూర్ లోని జెపి నగర్ వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు కాంశ్య విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత అల్లూరి ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, ఏ స్ఫూర్తితో అయితే ఆయన పోరాడారో అదే స్ఫూర్తిని నేటి యువత భావితరాల కోసం ముందుకు నడవాలని జనసేన పార్టీ నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కళ్యాణ్ చక్రవర్తి లక్ష్మీనారాయణ, అరుణ్ కుమార్, అశోక్, జి ఎస్ కే శ్రావణ్, సందీప్, హనుమంతు నాయక్, ప్రవీణ్ సాహో, వీర మహిళలు దాక్షాయని, వెంకట్ లక్ష్మి, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.