- రూ . 11 కోట్ల 81 లక్షల అభివృద్ధి పనులు
- కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రూ . 11 కోట్ల 81 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు , వరద నీటి కాల్వల నిర్మాణం, శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ , స్టాలిన్ నగర్, FCI కాలనీ, జయప్రకాష్ నారాయణ నగర్, నాగార్జున ఎనక్లేవ్, మయూరి నగర్, డోవ కాలనీలలో పనులు చేపట్టనున్నారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రగతి ఎనక్లేవ్ నుంచి పటేల్ చెరువు వరకు రూ. 5 కోట్ల.71 లక్షలతో వరద నీటి కాల్వ నిర్మాణం, ప్రగతి ఎనక్లేవ్, FCI కాలనీ లలో రూ.53 లక్షలతో సీసీ రోడ్లు, స్టాలిన్ నగర్ కాలనీలో రూ.1 కోటి 90 లక్షలతో సీసీ రోడ్లు , శ్మశాన వాటిక అభివృద్ధి పనులు, జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, నాగార్జున ఎనక్లేవ్ కాలనీలో రూ.78 లక్షలతో సీసీ రోడ్లు , మయూరి నగర్ కాలనీ లో రూ.54. లక్షలతో సీసీ రోడ్లు, డోవ కాలనీ నుండి నడిగడ్డ తండా వరకు రూ. 1 కోటి 90 లక్షలతో వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.