నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడిగా బసవపత్రి అరుణ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో చందానగర్ కేంద్రంగా అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ లో 2010 నుండి 2014 వరకు విద్యార్థి నాయకుడిగా పని చేశారు. అనేక సమస్యలను పరిష్కరించారు. ఆ తర్వాత జనసేన పార్టీలో సైనికుడిగా పార్టీ కోసం పనిచేస్తూ పలు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చందానగర్ డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగంకి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో చందానగర్ డివిజన్ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
నిత్యం అంకితభావంతో పనిచేస్తానని, చందానగర్ డివిజన్ లోని ప్రతి ఓటర్ వద్దకు, యువతకు జనసేన పార్టీని చేరుస్తానని అన్నారు. చందానగర్ లో జనసేన పార్టీని బలోపేతం చేసేవిధంగా కార్యకర్తలను నిర్మాణం చేస్తానన్నారు. చందానగర్ డివిజన్ అధ్యక్షుడిగా అరుణ్ కుమార్ నియామకం పట్ల డివిజన్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.