నమస్తే శేరిలింగంపల్లి : వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధి హుడా ట్రేడ్ సెంటర్ లోని గాంధీ ఎస్టేట్స్ వద్ద ఏర్పాటు చేసిన పలు గణేశుడి మండపాలలో వినాయక నవరాత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయా మండపాలలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ గౌడ్, మల్లేష్, అపార్ట్ మెంట్ వాసులు పాల్గొన్నారు.