నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవుచే ముద్రింపబడిన ప్రపంచ జల దినోత్సవ అవగాహన పత్రాన్నిహెచ్.ఎం.డబ్ల్యూ.ఎస్. & ఎస్.బి.15వ డివిజన్ జనరల్ మేనేజర్ రాజశేఖర్ హఫీజ్ పేటలోని కార్యాలయములో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈ విశ్వంలో సమస్త జీవకోటికి గాలి తరువాత నీరే ప్రాణాధారమని, నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదము వెల్లి విరుస్తుందని, అలాగే అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధాన ఆధారమని అన్నారు.
భవిష్యత్తు తరాలకు అవసరమైన నీటిని అందించడానికై అందరిచేత నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో జల మండలి అధికారులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జి.వి.రావు, పాలం శ్రీను, జనార్ధన్, మల్లారెడ్డి, అమ్మయ్య చౌదరి, కొవ్వూరి అశోక్ పాల్గొన్నారు.