- ఎంసీపీఐ (యూ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి : భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పాసిజానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ అన్నారు. భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 92వ వర్ధంతి కార్యక్రమం యంసిపీఐ(యు), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మియాపూర్, నడిగడ్డ తాండలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితులలో మతోద్మాదం అలాగే పాసింజర్ పెట్రేగిపోతుందని, వీటికి వ్యతిరేకంగా నాడు బ్రిటిష్ సామ్రాజవాదులకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని ఆకాంక్షించి చిన్న వయసులో ప్రాణాలను విడిచిన భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి ప్రజలు పోరాడాలని అన్నారు. యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇ. దశరథ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్, ఎఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనిల్ కుమార్, ఎఐఎఫ్ డీ డబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు పి.భాగ్యమ్మ, మైదన ప్రాంత గిరిజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ వి.తుకారాం నాయక్, ఎఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, ఎఐఎఫ్ డీ డబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు టి.పుష్పాలత, ఎఐఎఫ్డీవై గ్రేటర్ హైదరాబాద్ యువతుల విభాగం కన్వీనర్ యం.డి సుల్తానా,యుపియన్ యం నాయకురాలు దార లక్ష్మీ, శివాని, డి.నరసింహ, టి.నర్సింగ్, యన్.నాగభూషణం, ఇసాక్, యం.డి.నజీర్, దస్తప్ప పాల్గొని నివాళులర్పించారు.