నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసి ఆర్టీసీ ఎండీగా బదిలీపై వెళ్తున్న వీసీ సజ్జనార్ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు పోలీస్ కమిషనర్ గా సేవలందించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డికి, ప్రజా ప్రతినిధులకు, రంగారెడ్డి , మేడ్చల్ జిల్లా కలెక్టర్లకు, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల జడ్జి లకు, సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, తెలంగాణ పోలీస్ అధికారులకు, ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఇతర సంస్థలు, ఎస్సీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రతీ అడుగులో వెన్నంటి నడిచి ప్రోత్సహించిన రంగా రెడ్డి, మేడ్చల్ ప్రజా సంఘాలకు, ప్రజలకు, మీడియా మిత్రులకు వీసీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.