నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, గోపన్ పల్లి తాండా, ఎన్టీఆర్ నగర్, నవోదయ కాలనీలో విద్యుత్ స్తంబాలు, విద్యుత్ దీపాల పనితీరుపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. గోపన్ పల్లి, గోపన్ పల్లి తాండా, ఎన్టీఆర్ నగర్, నవోదయ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను విద్యుత్ శాఖ అధికారులకు దృష్టికి కార్పొరేటర్ తీసుకెళ్లారు. కొత్త కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటూ, డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంద్రదీప్, డిప్యూటీ ఇంజనీర్ మల్లికార్జున్, సూపర్ వైజర్ రాజు , బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , సీనియర్ నాయకులు శ్రీనివాస్, శ్రీరాములు, వేణు, రంగస్వామి, సుబ్రమణ్యం, వేంకటేశ్వర రావు, నర్సింగ్ నాయక్, ప్రకాష్, మారుతి, ఫణీంద్ర , శ్రీహరి, రంగస్వామి, చిన్నా, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.