నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ మహమ్మారితో మరణించిన వారి కుటుంబ సభ్యులు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా కోసం దగ్గర్లోని మీ సేవా కేంద్రాల్లో గాని, ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ల లో గాని దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి పరిహారం అందనున్నట్లు చెప్పారు. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆన్ లైన్ లో కింది పత్రాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు.
1. మరణించిన వారి ఆధార్ కార్డు
2. మరణ ధృవీకరణ పత్రం
3. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు
4. కోవిడ్ నిర్ధారణ పత్రము
5. ఫోన్ నెంబర్
6. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ (IFSCకోడ్ నెంబర్)
మీ దగ్గరలో ఉన్న ఈ సేవ కేంద్రం లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ మరణ ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులతో కమిటీ ఉంటుందన్నారు. దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అర్హులైన వారికి 30 రోజుల్లోపు పరిహారం అందజేస్తారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.