నేటి నుండి మూడు రోజులు సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రధాత, ముఖ్యమంత్రి‌ కేసీఆర్ జన్మదినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోనున్నట్లు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం కొండాపూర్ డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబురాలను ఘనంగా జరుపుకోనున్నట్లు చెప్పారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధనను సాకారం చేసి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 15 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు కొండాపూర్ డివిజన్ లో మూడు రోజులపాటు నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. మొదటి రోజు 15వ తేదీన ఉదయం 9 నుండి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్ అందజేయడం, 16 న ఉదయం 9 ల నుండి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో రక్తదాన శిబిరం, 17 న ఉదయం 9 గంటలకు కొండాపూర్ డివిజన్ లోని రాజా రాజేశ్వరి కాలనీ హై టెన్షన్ 100 ఫీట్ రోడ్డులోని జీహెచ్ఎంసి పురాతన బావి దగ్గర పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ‌పార్టీ కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల కమిటీ మెంబర్లు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి ‌చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here