సైబరాబాద్(నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పాస్‌పోర్టు దరఖాస్తుదారులను వారి పోలీస్‌స్టేషన్ల ఆధారంగా నాలుగు పరిధులుగా అధికారులు విభజించారు. దరఖాస్తు చేసేముందు వారు ఏ విభాగానికి చెందినవారో గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. కమీషనరేట్ పరిధిలోకి వచ్చే పోలీస్‌స్టేషన్‌లను సైబరాబాద్ 1, సైబరాబాద్ 2, సైబరాబాద్ 3, సైబరాబాద్ 4లుగా విభజించారు. సైబరాబాద్ 1 పరిధిలో అమన్‌గల్, చందానగర్, చేవెళ్ల, చౌదర్‌గూడ, గచ్చిబౌలి, కడ్తల్, కేశంపేట, కొందుర్గ్, కొత్తూర్, మాదాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, మియాపూర్, మొయినాబాద్, నందిగామ, నార్సింగి, ఆర్‌జిఐఎ, రాయదుర్గం, రాజేంద్రనగర్, షాబాద్, షాద్‌నగర్, శంషాబాద్, శంకర్‌పల్లి, తాల కొండపల్లి పోలీస్‌స్టేషన్‌లు ఉండగా, సైబరాబాద్ 2 పరిధిలో అల్వాల్, బాచుపల్లి, బాలానగర్, దుండిగల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కెపిహెచ్‌బి, కూకట్‌పల్లి, మేడ్చల్, పేట్ బషీర్‌బాగ్, షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లు ఉన్నాయి. సైబరాబాద్ 3 పరిధిలో సనత్‌నగర్, సైబరాబాద్ 4 పరిధిలో రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లు ఉన్నాయి. పాస్‌పోర్టు దరఖాస్తులో సందేహాలకు 040-2785 3414 నెంబరులో సంప్రదించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.