శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు వ్యాయామం చేయాలి : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • ఇండియా ఫిట్ నెస్ ఎక్స్పో -2023 పోటీల్లో ఫిజికల్లీ హాండిక్యాప్డ్ కేటగిరీలో విజేతలకు బహుమతులు అందజేసిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఎస్-9 క్లాసిక్ ఆధ్వర్యంలో ఇండియా ఫిట్ నెస్ ఎక్స్పో -2023 పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వాహకుల ఆహ్వానం బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఫిజికల్ హండికేప్డ్ కేటగిరీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ కు పూలబొకే తో స్వాగతం పలుకుతున్న దృశ్యం
ఇండియా ఫిట్ నెస్ ఎక్స్పో -2023 పోటీల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

విజేతలకు, పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచి భాగస్వామిని చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజుల్లో వ్యాయామంతో వచ్చే ఉల్లాసం , ఉత్సాహం మనకు మానసికంగా , శారీరకంగా దృఢంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుందని, అంగ వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా వారు ఈ ఎక్స్పో లో పాల్గొనడం, గెలుపొందటం అంత సులువుగా అయ్యే పని కాదన్నారు. వారిని మనం ఆదర్శంగా తీసుకుని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్స్ సతీష్, తరుణ్, అనిల్ కుమార్ యాదవ్, అరుణ్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, సాయి, సూరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here