- ఏ ఎం హెచ్ ఓ కార్తిక్ పై చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ శంకరయ్యకు ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధి ఆదిత్య నగర్ లో ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో కాలనీ వాసుల పలు విజ్ఞప్తులు వారి ద్రుష్టి తెచ్చారు. అపరిశుభ్ర వాతావరణంలో బల్క్ చికెన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి పై ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన ఉదాసీనత వ్యవహరిస్తున్న చందానగర్ ఏ ఎం హెచ్ ఓ కార్తిక్ పై ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రజా ఆరోగ్యం పట్ల ఆశ్రధ్ద వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ ఏ ఎం హెచ్ ఓ కార్తిక్ పై చర్యలు తీసుకోవాలని, ఆయన అవలంబిస్తున్న తీరు పై ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జోనల్ కమిషనర్ శంకరయ్యకు ఫోను లో తెలిపారు. అంతేకాక పారిశుధ్య కార్మికుల నియామకాల్లో, పారిశుధ్య ఆటోల పంపిణీ విషయాలలో అనేక ఆరోపణలు వచ్చాయని, ఇలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.