కిడ్నీ వ్యాధుల పై అశ్రద్ధ వద్దు

  • కిడ్నీ వ్యాధుల పై అవగాహన
  • మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్ గ్రూప్- బంజారా చాప్టర్ బైక్ రైడ్
జెండా ఊపి బైక్ రైడ్ ను ప్రారంభిస్తున్న దృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలలో చైతన్య కలిగించడానికి , కిడ్నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదనే ఉదేశ్యంతో, కిడ్నీల రక్షణే అందరి ప్రధమ ధ్యేయం అనే నినాదంతో మెడికవర్ హాస్పిటల్స్, హార్లీ డేవిడ్సన్ బైకర్స్ ఆదివారం సంయుక్తంగా బైక్ రైడ్ నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ అవుట్ పేషెంట్ సెంటర్ నుంచి ప్రారంభించి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ , మీదుగా తిరిగి మెడికవర్ హాస్పిటల్స్ చేరుకున్నారు. 50 మంది బైక్ రైడర్స్ పాల్గొన్నారు.

బైక్ రైడ్ ను ప్రారంభించిన హార్లే ఓనర్ గ్రూప్- బంజారా చాప్టర్ బృందం

డాక్టర్ కమల్ కిరణ్ (నెఫ్రోలజి & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విభాగపు డైరెక్టర్ -మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ ) మాట్లాడుతూ “కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీ ఫెయిల్యూర్ గా మారే అవకాశం చాలా ఎక్కువని అన్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా వారికీ నూతన జీవితాన్ని ఇవ్వొచ్చని అన్నారు. కిడ్నీ వ్యాధులమీద చైతన్యం పెంచుకోవడమే కాకుండా , ప్రత్యేకంగా కిడ్నీ ఆరోగ్యానికి సంబందించిన ఆహారాన్ని, శ్రద్ధను పెంపొందించుకునే యోచన చేయాలని, 30ఏళ్ళు పై బడిన వారు , బీపీ లేదా షుగర్ ఉన్నవారు ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి కిడ్నీ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు.

మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్ గ్రూప్- బంజారా చాప్టర్ బృందం

మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ – మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ ” కిడ్నీ సేవలకు ప్రత్యక విభాగం , ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజీలు , అనుభవజ్ఞులైన డాక్టర్లు , అత్యుత్తమ సాంకేతికత కలిగిన వ్యాధి నిర్ధారణ పరికరాలు మెడికవర్ హాస్పిటల్స్ లో ఉన్నాయనీ , లక్షలాది మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నామని , దేశీయ, విదేశీ రోగులకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లను ఎంతో నైపుణ్యంతో విజయవంతంగా చేస్తున్నామని తెలిపారు. విశ్వసనీయ కిడ్నీ సేవలకు మెడికవర్ పెట్టింది పేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెఫ్రోలోజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, సెంటర్ హెడ్ మాత ప్రసాద్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here