నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని డివిజన్లు, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడా, గుల్షన్ నగర్, గోపాల్ రెడ్డి నగర్ కాలనీలలో రూ.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజి(యూజీడీ) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డిజీఎం శరత్ రెడ్డి, మేనేజర్లు యాదయ్య, సందీప్, మాజీ కార్పోరేటర్ నీలం రవీందర్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.