వ్యాధినిరోధక శక్తిని పెంచే హోమియో మందులను పంపిణీ చేసిన మిరియాల ప్రీతం

 

హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్న మిరియాల ప్రీతం

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ యువ నాయకులు, మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం ఆద్వర్యంలో స్థానిక నిరుపేదలకు కరోనాను జయించగల వ్యాధినిరోధక శక్తిని పెంచే మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ Arsenicum album 30 అనే హోమియోపతి మందు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ధారించిందని, గుజరాత్ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ మందు వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే తనవంతుగా చందానగర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే దాదాపు 1000 మంది నిరుపేదలకు ఉచితంగా ఈ మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కరోనా విజృంభన సమయంలో రాఘవా చారిటబుల్ ట్రస్ట్ పేరిట తమ వంతు సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

హోమియోపతి మందులు తీసుకున్నవారితో మిరియాల చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, టీఆర్ఎస్ యువ నాయకుడు మిరియాల ప్రీతం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here