అర్హులైన దివ్యాంగులకు దశల వారీగా ఉపకరణాలు అందజేస్తాం : ప్రభుత్వ విప్ గాంధీ

  • దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు అందజేత
  • వీల్ ఛైర్స్- 4, ట్రై సైకిల్స్ -5, వినికిడి యంత్రాలు- 5, బ్లైండ్ స్టిక్స్ -10, ఉత కర్రలు – 5 తదితర  పరికరాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమాఖ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి మోతి, చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ లక్ష్మీ బాయి, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని విభిన్న ప్రతిభావంతులకు(దివ్యాంగులకు) ఉచిత ఉపకరణాలను, సహాయ పరికరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.

దివ్యాంగులకు పరికరాలు అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
దివ్యాంగులకు పరికరాలు అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో దివ్యాంగుల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, కోట్ల రూపాయలు వెచ్చించి ఆసరా ఫించన్ , ఉచిత సహాయ పరికరాలు పంపిణీ చేస్తున్నారని, దివ్యాంగులు వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా ఆత్మ స్థైర్యం నింపారని, వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు(దివ్యాంగులకు) వీల్ ఛైర్స్- 4, ట్రై సైకిల్స్ -5, వినికిడి యంత్రాలు- 5, బ్లైండ్ స్టిక్స్ -10, ఉత కర్రలు – 5 వంటి మొదలగు వివిధ పరికరాలు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మరిన్ని ఉపకరణాలు రాబోయే రోజులలో దశల వారిగా అందచేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సదరం సర్టిఫికెట్లు సమస్యలు, దివ్యాంగుల కోసం సంక్షేమ సంగం భవనం నిర్మించాలని ప్రభుత్వ విప్ గాంధీని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు మాన్వి, ఉషారాణి , దివ్యంగుల ప్రెసిడెంట్ అశోక్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు పులిపాటి నాగరాజు, కర్ణాకర్ గౌడ్, ఓ. వెంకటేష్, రఘునాథ్, నరేందర్ బల్లా, రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన దివ్యాంగులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here