బి.ఆర్.ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది

  • మాదాపూర్ డివిజన్ సాయి నగర్ కాలనీ నుంచి చేరికలు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
పార్టీలో చేరిన వారితో రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపుర్ డివిజన్, సాయి నగర్ కాలనీ నుంచి దాదాపు 100 మంది పైగా యువకులు శ్రీనివాస్ ముదిరాజ్, మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రవి కుమార్ యాదవ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. నరేంద్ర మోడీ పరిపాలన తీరు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోరాటపటిమ, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు, రవికుమార్ యాదవ్ నాయకత్వాన్ని బలపరిచేందుకు పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో రోజు రోజుకి బిజెపి పార్టీ బలపడుతుందని ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వేలాది మంది పార్టీలో కలుస్తూ బిజెపి పార్టీకి మద్దతు తెలియజేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రేపు జరగబోయే సాధారణ ఎన్నికలలో తెలంగాణలో బిజెపి పాగ వేయడానికి అన్ని విధాల కృషి చేయాలని పిలుపునిస్తూ శేరిలింగంపల్లిలో కాషాయ జెండా ఎగరవేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని నట్టేట ముంచిందని అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినా ప్రభుత్వం ఏండ్లు గడుస్తున్నా యువతను పట్టించుకోకపోవడం దారుణమని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి యువత పెద్ద ఎత్తున నడుం బిగించాలని పిలుపునిచ్చారు. నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజల అవసరాలను పక్కనపెట్టి తమ ఎదుగుదలనే ఎజెండాగా పెట్టుకొని ప్రజలను పట్టించుకోకుండా యధేచ్చగా చెరువులను, పార్కులను, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని రానున్న రోజుల్లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో చెరువుల ఆక్రమణపై పెద్ద ఎత్తున ఉద్యమించి కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర యాదవ్, భిక్షపతి యాదవ్, ఐలయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్ వారి మిత్ర బృందం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రాధాకృష్ణ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, మధు యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, గోపాల్ ముదిరాజ్, బాలు నాయక్ పాల్గొన్నారు,

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here