ప్రజాసేవకు మద్దతు అందించండి: మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్

  • మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ ఆత్మీయ సమ్మేళనం
  • పార్టీలకతీతంగా తుల్జా భవాని టెంపుల్ తారా నగర్ లో సమ్మేళనం
తుల్జా భవాని టెంపుల్ తారా నగర్ లో ఆత్మీయ సమ్మేళనంలో మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్ బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ తారనగర్ లోని తుల్జా భవాని టెంపుల్ వద్ద శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో తారా నగర్ మార్వాడి సమాజ్, పాత మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ .. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మన్నను పొందుతూ ఒకసారి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ సభలో పాల్గొన్న వారితో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. రాబోయే రోజుల్లో తన కుమారుడు రవి కుమార్ యాదవ్ కు కూడా మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని అందుకు మీ ఆశీర్వాదాలు అందించాలని కోరారు.

ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి లేదని తెలియజేస్తూ తండ్రి చూపిన బాటలో నడుస్తానని, ప్రజల కష్ట , నష్టాల్లో పాలుపంచుకుంటానని తెలియజేస్తూ మునుముందు రోజుల్లో ప్రజాసేవ చేయడానికి మీ అందరి మద్దతు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి మాజీ సర్పంచ్ వెంక రెడ్డి పటేల్, ఎల్లేష్ , అనిల్ కుమార్ యాదవ్, మాల్చంద్ జి.రాజ్ కమల్, బచ్చు రాజు, దినేష్ బోరా, రూపు, రామాచారి, హనుమంతరావు, సుగ్దేవ్ జోషి, పురుషోత్తం తివారి, ముఖేష్, దీన్ దయాల్ జోషి మాధవన్ తివారి, పాండు, హబీబ్ సాబ్, మల్లికార్జున్ రెడ్డి, వెంకటపతి గౌడ్, మల్లేష్ గౌడ్, సోమయ్య యాదవ్, బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here