- హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా ఆత్మీయ సమావేశం
- పెద్ద ఎత్తున బిఆర్ ఎస్ లో చేరిన టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల సంపూర్ణ మద్దతు బిఆర్ ఎస్ వెంటే ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్ ఎస్ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ 109 డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అధ్యక్షతన భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
మదీనగుడా విలేజ్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా బిఆర్ యస్ లోకి భారీగా చేరారు. బీజేపీ, టీడీపీ నుండి 200మంది కార్యకర్తలు, నాయకులు బిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గాంధీ పార్టీ కండువా కప్పి సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గాంధీ గెలిపించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రఘుపతి రెడ్డి , అఖిల్ పటేల్, బబ్లూ, వసాలి చంద్రశేఖర్ ప్రసాద్, సుప్రజ ప్రవీణ్ మోహన్ గౌడ్, ఉరిటి వెంకట్రావు, వాళ్ల హరీష్, రవిందర్ రెడ్డి, నిమ్మల రామకృష్ణ గౌడ, నిమ్మల దాత్రినాత్ గౌడ్, నిమ్మల శేఖర్ గౌడ్, దోతి మల్లేష్, జనార్ధన్ గౌడ్, లక్ష్మణ్ , మహిళ నాయకులు, ఆశ, కల్యాణి, బాలరాజు, రవి పాల్గొన్నారు.