- ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ గాంధీ
- మంగళ హారతులతో అపూర్వ స్వాగతం పలికిన మహిళ సోదరీమణులు
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. అంతకుముందు శేరిలింగంపల్లి డివిజన్ పరిధి ఆదర్శ్ నగర్ లోని రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు.
కారు గుర్తుకు ఓటేసి మళ్లీ గెలిపించాలని కోరారు. అనంతరం ఆదర్శ్ నగర్, నెహ్రు నగర్, గోపి నగర్, బాపు నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.