- భగత్ సింగ్ ఆర్గనైజేషన్ పేరిటా స్కూల్ కోసం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు
- ముందుగా రూ. లక్ష అందిస్తామని ప్రధానోపాధ్యాయుడుకి లిఖిత పూర్వక హామీ
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట గ్రామంలో చాలా సంవత్సరాలుగా అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల నేడు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లనున్నది. పాఠశాల దుస్థితిని చూసి చలించి స్కూలు ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో హఫీజ్ పేట యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ భగత్ సింగ్ ఆర్గనైజేషన్ పేరుతో కేవలం ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఒక స్వచ్ఛందసంస్థ ను స్థాపించాడు, చుట్టుపక్కల ఉన్న సాయినగర్, జనప్రియ కాలనీ, ప్రకాష్ నగర్, వినాయకనగర్, ఆల్విన్ కాలనీలలోని పలువురు యువకులను ఈ స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా చేసుకొని, గణతంత్ర దినోత్సవం సంధర్భంగా భారీ సంఖ్యలో యువకులతో ప్రకాష్ నగర్ నుండి హఫీజ్ పేట్ గవర్నమెంట్ స్కూలు వరకు బైకుర్యాలీ నిర్వహించారు. స్కూలు ప్రధానోపాధ్యాయులని కలిసి తమ సంస్థ ద్వారా స్కూలు అభివృద్ధి కోసమై విరాళాలు సేకరించి ఇస్తామని హామీ పత్రాన్ని అందజేశారు. ముందుగా తనవంతు సహాయంగా లక్ష రూపాయలు ఇస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, శేఖర్ గౌడ్, జనప్రియ శ్రీనివాస్,ఇమ్రాన్, హట్కర్ శ్రీనివాస్, గౌతమ్ జ్ఞాని, గణేశ్ పాల్గొన్నారు.