- గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకొని చదువుల్లో రాణించి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాగా చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ పాఠశాలలో ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తామని, అందుకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు యాదగిరి, ఉపాధ్యాయులు పండు, మొగులయ్య,ఉమా దేవి, సరితా, అంగం వాడి టీచర్ రాధిక. గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు, పిల్లలు, స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.