- పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, బాలింగ్ గౌతమ్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీలో షాబాన ఆధ్వర్యంలో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ విందులో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడారు. రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, నిమ్మల రామకృష్ణ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, షేక్ జమీర్, సబీర్, మల్లేష్ గౌడ్, సాదిక్, అంజాద్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.