- మాతృశ్రీనగర్ వాసుల స్వచ్ఛంద స్వచ్ఛ్ భారత్
నమస్తే శేరిలింగంపల్లి: నిత్యం చిన్నపిల్లలు, క్రీడాకారులు ఆడుకునే మైదానం, పెద్దలు వాకింగ్ చేసుకునేందుకు అనువైన స్థలం, రోజు ఇక్కడ క్రికెట్, వాలీబాల్ ఆడుకునేందుకు వచ్చే సాప్ట్ వేర్, ఫార్మా కంపెనీ ఉద్యోగులతో కళకళలాడే ప్రాంతం నేడు అధ్వాన్నంగా తయారై బోసిపోయింది. వర్షాల కారణంగా చెట్లు, కలుపు మొక్కలు గుబురుగా పెరగటంతో నిరుపయోగంగా మారింది. ఇది ఇంతకుముందు మాతృశ్రీ నగర్ కాలనీ కమ్యూనిటీ గ్రౌండ్ పరిస్థితి. ప్రస్తుతం అందరు ఉపయోగించుకునెలా సిద్దమైంది. సుమారు 1.5 ఎకరం విస్తీర్ణం ఉన్న ఈ మైదానాన్ని మాతృశ్రీ నగర్ కాలనీ పెద్దలు, స్థానిక క్రీడాకారులు, ఉద్యోగులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శుభ్రం చేశారు. కాలనీలోని అన్ని రంగాలకు చెందిన సభ్యుల సహకారంతో మళ్ళీ ఈ గ్రౌండ్ కు పూర్వ వైభవం వచ్చింది. ఈ కార్యక్రమంలో సీ హెచ్ రామయ్య, అమరనాధ్, కాజా శ్రీనివాస రావు, రవీంద్ర రెడ్డి, ఆంజనేయ రాజు, కోటేశ్వరరావు, సుదర్శన్ రెడ్డి, హనుమంత రావు, శ్రీధర్, రామకృష్ణం రాజు, వెంకట్ RSS సభ్యులు పాల్గొన్నారు.