నమస్తే శేరిలింగంపల్లి: ఎంసిపిఐయు వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 14వ వర్ధంతిని నడిగడ్డ తండా ఎంసీపీఐయు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దేవనూర్ నర్సింహా అధ్యక్షతన నిర్వహించారు. ఎంసీపీఐయు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వి. తుకారాం నాయక్ హాజరై ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కామ్రేడ్ ఓంకార్ వర్ధంతి సభల సందర్భంగా అక్టోబర్ 17 నుండి 31 వరకు బీసీ జనగణన చేపట్టాలని, జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. అప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చట్టసభలో న్యాయం జరుగుతుందన్నారు. పేదలు నివసించడానికి గూడు గుడ్డ రోగం వస్తే ప్రభుత్వ దవాఖానలో సాగునీరు, తాగునీరు అందించాలని.. అనేక పోరాటాలు నిర్వహించిన సందర్భంగా కామ్రేడ్ ఓంకార్ ని అసెంబ్లీ టైగర్ గా పిలుస్తారని అన్నారు. కామ్రేడ్ ఓంకార్ ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంసీపీ ఐ యు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఏఐఎఫ్ డిడబ్ల్యూ రాష్ట్రా నాయకురాలు, దేవనూర్ లక్ష్మి, ఎంసిపిఐ యు పార్టీ స్థానిక నాయకులు హసనొద్దీన్, ప్రకాష్ నాయక్, ప్రేమ్ నాయక్, హుస్సేన్, అనిత బాబాయి , దాస్లీ బాయి, శివ, ఖైరనిష బేగం, గౌసియా బేగం పాపారావు, అనిత ఘమ్మ, అబ్బాష్ అంజి బాయి, బాషా నాయక్, దయాకర్ పాల్గొన్నారు.